124 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాన్ని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన నగదును కనుగొన్నారు. రూ.124 కోట్లు ఓకే వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు గుర్తించారు. మహమ్మద్ బిన్ మహ్మద్ పేరిట బ్యాంకు ఖాతా ఉన్నట్లు కనిపెట్టారు. హైదరాబాద్ ఎస్బీఐకి చెందిన 6
సైబర్ నేరగాన్ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు


హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్ పోలీసులు సైబర్

నేరగాళ్లు కొల్లగొట్టిన నగదును కనుగొన్నారు. రూ.124 కోట్లు ఓకే వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు గుర్తించారు.

మహమ్మద్ బిన్ మహ్మద్ పేరిట బ్యాంకు ఖాతా ఉన్నట్లు కనిపెట్టారు. హైదరాబాద్ ఎస్బీఐకి చెందిన 6 కరెంట్ ఖాతాల్లోకి నగదును ఈ ఖాతా బదిలీ చేశారు. అలాగే 6 కరెంట్ ఖాతాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు చేసింది. 6 ఖాతాల్లో 2 నెలల్లో మొత్తం రూ.150 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీంతో నిందితుడు మహ్మద్ బిన్ అహ్మద్ ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే నిందితుడు చేసిన లావాదేవీలు మొత్తం.. రూ.124 కోట్లు దేశంలోని

234 సైబర్ నేరాలకు సంబంధించినవిగా గుర్తించారు.

కమిషన్ కోసం బ్యాంకు ఖాతాలను సమకూర్చారని,నిందితుడిని అరెస్ట్ చేసి మిగిలిన ఖాతాలపై దర్యాప్తు

చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande