లెబనాన్, 29 సెప్టెంబర్ (హి.స).- ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా(Nasrallah) మృతి చెందడంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) స్పందించారు. నస్రల్లాను హతమార్చడంతో ఇజ్రాయెల్ లెక్క సరిచేసిందని పేర్కొన్నారు. ఈ చర్య ఇజ్రాయెల్‌కు ఓ చరిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. నస్రల్లా అనేక మంది ఇజ్రాయెల్, అమెరికా, ఫ్రెంచ్ పౌరుల హత్యలకు కారణమైన హంతకుడని అన్నారు.
‘‘ఇజ్రాయెల్ పౌరులారా.. ఇవి మనకు చాలా ముఖ్యమైన రోజులు. మనం ఓ చారిత్రక మలుపును చూడబోతున్నాం. ఏడాది క్రితం అక్టోబర్ 7న మన శత్రువులు మనపై దాడి చేశారు. ఇజ్రాయెల్ తుడిచిపెట్టుకుపోయే దశలో ఉందని భావించారు. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత వారిని దెబ్బ మీద దెబ్బ కొట్టాం. దీని ద్వారా వారి ఆశలు ఎలా చెల్లాచెదురయ్యాయో అర్థమవుతోంది. మనం గెలుస్తున్నాం’’ అని నెతన్యాహు ప్రజలనుద్దేశించి అన్నారు. తమ శత్రువులపై దాడి కొనసాగిస్తామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు