గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుండి కీలక అప్డేట్
సినిమా, 30 సెప్టెంబర్(హి.స) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ 'గేమ్ 'చేంజర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్ కాగా.. అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్,
గేమ్ చేజర్ మూవీ నుండి ఫుల్ సాంగ్ రిలీజ్


సినిమా, 30 సెప్టెంబర్(హి.స)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ 'గేమ్ 'చేంజర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్ కాగా.. అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్నారు. 2024 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న 'గేమ్ చేంజర్' తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇక సినిమా విడుదలకు ఎంతో సమయం లేకపోవడంతో వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ను ఫుల్ ఖుష్ చేస్తున్నారు చిత్ర బృందం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande