స్పోర్ట్స్, 30 సెప్టెంబర్ (హి.స.)
బంగ్లాదేశ్ తో కాన్పూర్ వేదికగా గ్రీన్ పార్క్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత పురుషుల క్రికెట్ జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో సూపర్ రికార్డు నమోదు చేసింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన టీమ్ గా భారత్ ఈ ఫీట్ సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది.భారత ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన జోడిగా రికార్డు క్రియేట్ చేశారు.అలాగే కేవలం 10.1 ఓవర్లలో వంద పరుగులు చేసి టెస్టుల్లో అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.తదుపరి వార్తలు అందేసరికి టీమిండియా 34 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.రాహుల్ 68 పరుగులు,ఆకాశ్ దీప్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్