కడప 30 సెప్టెంబర్ (హి.స.): పులివెందుల నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వీఆర్ఏ ) ఇంటిని దుండగులు డిటోనేటర్లతో (పేల్చివేశారు. వేముల మండలం, కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వీఆర్ఏ నర్సింహులు ( మృతి చెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. దంపతులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పేలుడు శబ్ధంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల