అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)
కార్పొరేషన్, వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ పి.సంపత్‌కుమార్ నేతృత్వంలో అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం సాయంత్రం విజయవాడ బయల్దేరారు. 1400 మంది పారిశుద్ధ్య కార్మికులు 29 బస్సుల్లో తరలివెళ్లారు. అదనపు కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్, 16 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఒక పర్యవేక్షక ఇంజినీరు, ముగ్గురు కార్యనిర్వాహక ఇంజినీర్లు, ముగ్గురు ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, 8 మంది సహాయ ఇంజినీర్లు విజయవాడ ప్రయాణమయ్యారు. ఏడు తాగునీటి ట్యాంకర్లను కూడా తీసుకెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల