సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, 13 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అయిన అమరావతి (Amaravati)లో అత్యాధునిక హంగులతో నూతన సీఆర్డీఏ (CRDA) కార్యాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈ రోజు ఉద
సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు


అమరావతి, 13 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అయిన అమరావతి (Amaravati)లో అత్యాధునిక హంగులతో నూతన సీఆర్డీఏ (CRDA) కార్యాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈ రోజు ఉదయం. 9.54 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి నారాయణలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాయపూడి సమీపంలోని సీడ్ ఆక్సిస్ రోడ్ వద్ద నిర్మించిన ఈ కార్యాలయం మొత్తం 3,07,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి+7 అంతస్తులతో రూపుదిద్దుకుంది. ఇందులో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, బ్యాంకు, AI కమాండ్ సెంటర్, సమావేశ మందిరాలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, CRDA, ADCL విభాగాలు మరియు ఉన్నతాధికారుల ఛాంబర్లు ఏర్పాటు చేశారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande