అమరావతి, 13 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC Notification) ఇచ్చింది. ఇందులో భాగంగా 16 వేల పోస్టులకు పరీక్షలు నిర్వహించి, ఫలితాల అనంతరం ఇటీవల వారికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కాగా కొత్తగా ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించిన 16 వేల మంది ఈ రోజు వారి వారి ప్రాంతాల్లో విదుల్లో చేరుతున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) నూతన ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
అందులో కూటమి ప్రభుత్వం.. అడ్డంకులు ఎదురైనా, కొంత మంది ఎన్ని ఆటంకాలు సృష్టించినా మెగా డీఎస్సీ మాట నిలబెట్టుకున్నాం. వేలాదిమంది ఉద్యోగ కల సాకారం చేశాం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే, లక్షలాది ఉపాధ్యాయులకు తోడు అవుతున్నారు. 16 వేల మంది నూతన ఉపాధ్యాయులు. ఆటపాటలతో, మంచి మాటలతో విద్యార్థుల సమగ్ర వికాసాన్ని గురుతర బాధ్యతగా నిర్వర్తించాలని కోరుతున్నాను. నేటి నుంచి ఉపాధ్యాయులుగా బడిలో అడుగుపెడుతున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ.. మంత్రి లోకేష్ నూతన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV