ప్రస్తుతం డీసీసీలుగా పని చేస్తున్న వారికి రెండోసారి అవకాశం లేదు.. మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.) ప్రస్తుతం డీసీసీలుగా పని చేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి అవకాశం లేదని ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్లో డీసీసీల ఎంపిక కోసం
మీనాక్షి నటరాజన్


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

ప్రస్తుతం డీసీసీలుగా పని చేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి అవకాశం లేదని ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్లో డీసీసీల ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు డీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఆదేశాలను వారికి తెలియజేశారు. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునే వారు కనీసం 5 ఏళ్ల పాటు నిరంతరంగా పార్టీలో క్రమశిక్షణతో పని చేసి ఉండాలని అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారని వెల్లడించారు. పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధుల దగ్గర బంధువులకు కూడా అవకాశాలు లేవని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. డీసీసీల ఎంపిక కోసం అధిష్టానం పంపించిన ఏఐసీసీ పరిశీలకులతో ఏ నాయకులు వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande