బీహార్, 14 అక్టోబర్ (హి.స.)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే
లక్ష్యంగా ఎన్డీయే కూటమి ముందుకు సాగుతోంది. ఇప్పటికే కూటమిలోని పార్టీల మధ్య సీట్ల కేటాయింపుల లెక్క తేల్చింది. అయితే తాజాగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడు పెంచింది. తాను పోటీ చేయనున్న 101 సీట్లకు గాను 71 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి తో ఉన్న ఐదు పార్టీలు మంగళవారం సాయంత్రం నాటికి తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ చెప్పారు. ఇదిలా ఉంటే ఎన్డీఏ తన సీట్ల పంపకాల ఒప్పందాన్ని ఖరారు చేసినప్పటికీ, మహాఘటబంధన్ (గ్రాండ్ అలయన్స్) ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని నివేదికలు సూచిస్తున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..