సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలేనా.. హరీశ్రావు ప్రశ్నల వర్షం
హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.) గురుకులాకు గ్రీన్ ఛానెల్లో నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలేనా..? మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండదు అనడాన
హరీష్ రావు


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

గురుకులాకు గ్రీన్ ఛానెల్లో నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలేనా..? మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండదు అనడానికి గురుకులకు కేటాయించిన చాలీ చాలని నిధులు మరో ఉదాహరణ అని విమర్శించారు. రాష్ట్రంలోని 1024 గురుకులాలకు కేవలం 60 కోట్లు కేటాయించి, గోరంతను కొండంతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రూ. 12 వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి.. ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు చదివే గురుకులాలకు కనీసం రూ.100 కోట్లు కేటాయించే మనసు రాలేదా? అని నిలదీశారు. కమీషన్లు రావనే గురుకులకు నిధులు కేటాయించడం లేదా? ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande