పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. విచారణ టీమ్ లో ఉన్న ఏఎస్ఐ తుపాకీతో కాల్చుకొని సూసైడ్
హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.) కులవివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న హర్యానా ఐపీఎస్ వై.పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసు విచారణ చేస్తున్న టీమ్ లో ఉన్న ఏఎస్ఐ సందీప్ కుమార్ ఇవాళ తుపాకీతో కాల్చుకుని ఆత్మహ
పూర్ణ కుమార్ కేసు


హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)

కులవివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న హర్యానా ఐపీఎస్ వై.పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసు విచారణ చేస్తున్న టీమ్ లో ఉన్న ఏఎస్ఐ సందీప్ కుమార్ ఇవాళ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు సందీప్ కుమార్ సూసైడ్ లెటర్ తో పాటు ఓ వీడియోను సైతం రికార్డు చేశాడు. ప్రస్తుతం రోహక్ సైబర్ సెల్లో పని చేస్తున్న ఐఎస్ఐ సందీప్ కుమార్, ఐఏఎస్ పూరణ్ కుమార్ పై సంచలన ఆరోణలు చేశారు. పూరణ్ కుమార్ జాతి వివక్షతో సిస్టమ్ హైజాక్ చేశారని, రోహ్ తక్ రెంజ్లో నియమితులయ్యాక పురణ్ కుమార్ నిజాయితీపరులైన పోలీసు అధికారుల స్థానంలో అవినీతిపరులైన అధికారులను నియమించుకోవడం మొదలు పెట్టారని ఆరోపించారు. వీరంతా ఫైళ్లను బ్లాక్ చేసి పిటిషనర్లకు ఫోన్ చేసి మానసికంగా హింసించారని డబ్బు అడిగారని ఆరోపించారు. బదిలీల కోసం మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా దోపిడీ చేశారని ఆరోపించారు. పూరణ్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయని తనపై వచ్చిన ఫిర్యాదుకు భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడని సందీప్ కుమార్ ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande