హైదరాబాద్, 14 అక్టోబర్ (హి.స.)
ఉప్పల్ పోలీస్ స్టేషన్కి కూతవేటు
దూరంలో ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన రెండు ఆర్టీసీ బస్సుల్లో గుర్తు తెలియని దుండగులు చోరీ చేసిన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నైట్ హాల్టింగుకు వచ్చిన తొర్రూరు డిపో కు చెందిన సూపర్ లగ్జరీ, రాజధాని బస్సుల డ్రైవర్ కి సంబంధించిన నగదు, బ్యాగ్, సెల్ ఫోన్, తదితర వస్తువులు అర్ధరాత్రి చోరీకి గురయ్యాయి. సూపర్ లక్సరీ బస్సులో డ్రైవర్ యాకయ్య నిద్రిస్తుండగా అర్థరాత్రి సమయం యాకయ్య బ్యాగ్, ఫోన్, పర్సు, పర్సు లో ఉన్న ఐదు వేల నగదు, ఐడి కార్డు, డిపో ఎస్ఆర్ లార్జ్ షీట్ తదితర వస్తువులు దుండగులు దొంగలించారు.
రాజధాని బస్సులో డ్రైవర్ రాజు నిద్రిస్తుండగా రాజధాని బస్సు తాళం దొంగలించినట్టు బాధితుడు తెలిపారు.ఉదయం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో లేచి చూసుకునే సరికి చోరీ జరిగింది. వెంటనే కూతవేటు లో ఉన్న ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇద్దరు డ్రైవర్లు పిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టనున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నైట్ హల్టింగుకు వచ్చిన ఆర్టీసీ డ్రైవర్ లకు ఎలాంటి రూముల లేకపోవడం డ్రైవర్ ల వస్తువులు చోరీకి గురవుతున్నాయి. ఉప్పల్ పిఎస్ కి కూతవేటులో భయం లేకుండా ఇలాంటి సంఘటనలకు దుండగులు పాల్పడుతుంటే, పోలిస్టేషన్ కి దూరంగా ఉన్న బస్తీలు, కాలనీల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నార్ధకంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..