కులసర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన నారాయణమూర్తి దంపతులు
బెంగళూరు, 16 అక్టోబర్ (హి.స.) రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి .. కర్నాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించారు. సుధా మూర్తి భర్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా ఆ సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. తామేమీ వ
నారాయణమూర్తి దంపతులు


బెంగళూరు, 16 అక్టోబర్ (హి.స.)

రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి .. కర్నాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించారు. సుధా మూర్తి భర్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా ఆ సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. తామేమీ వెనుకబడిన వర్గానికి చెందినవాళ్లము కాదు అని, అందుకే సర్వేలో పాల్గొనడం లేదని సుధామూర్తి తెలిపారు. సర్వేలో పాల్గొనడం లేదని సుధామూర్తి ప్రత్యేకంగా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించారు. తమ సర్వే రిపోర్టుతో ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కూడా కులసర్వేలో పాల్గొనడం లేదని ఆమె తెలిపారు. కర్నాటక ప్రభుత్వానికి చెందిన వెనుకబడిన తరగతుల కమీషన్.. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే పేరుతో కుల సర్వేను నిర్వహిస్తున్నది.

సుధా మూర్తి నిర్ణయం పట్ల కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సర్వేలో పాల్గొనాలని ఎవర్నీ వత్తిడి చేయడం లేదని, స్వచ్ఛందంగా ఆ సర్వేలో పాల్గొనాలని ఆయన అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande