హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.) మంత్రి కొండా సురేఖ
ఇంటివద్ద హైడ్రామా ఇష్యూపై కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నాయకులు కొండా మురళి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి వైరుద్యాలు లేవని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి తరవాత తెలంగాణకు అంతటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనుకున్నామని ఆయన సీఎం కావాలని కోరుకున్నామని చెప్పారు.
ఈ రోజు వరంగల్ లో పార్టీ మీటింగ్ ఉందని దానికోసమే వచ్చానని చెప్పారు. ఇంటివద్ద ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. సుమంత్ విషయం కూడా తనకు తెలియదని అన్నారు. పార్టీ మీటింగ్ కు కొండా సురేఖ కూడా వస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. తను ఇప్పటివరకు ఒకసారి కూడా సెక్రటరేట్కు వెళ్లలేదని ఇకపై కూడా వెళ్లనని చెప్పారు. కొండా సురేఖ చాంబర్ వాస్తు చూడటానికి మాత్రమే ఒకసారి వెళ్లానని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు