డాక్టర్ గైర్హాజరు పై కలెక్టర్ ఆగ్రహం.. షోకాస్ నోటీస్ జారీ
నాగర్ కర్నూల్, 16 అక్టోబర్ (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి, ఫార్మసీలోని మందుల స్టాక్, రోగులకు అందిస్తున్న చికిత్
నాగర్ కర్నూల్ కలెక్టర్


నాగర్ కర్నూల్, 16 అక్టోబర్ (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని

జిల్లా కలెక్టర్ సంతోష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి, ఫార్మసీలోని మందుల స్టాక్, రోగులకు అందిస్తున్న చికిత్స, రిజిస్టర్లు, రిపోర్టులు వంటి వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కల్పించేలా కలెక్టర్ స్వయంగా తన రక్తపోటు (బిపి)ని పరీక్షించుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజల ఆరోగ్యం పట్ల వైద్యులు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ సందర్శించిన సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడంపై డాక్టర్కు షోకాస్ నోటీస్ జారీ చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్కు కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande