నిజామాబాద్, 16 అక్టోబర్ (హి.స.)
కాంగ్రెస్లో పదవుల పండగకు రంగం సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందనే చర్చ. జిల్లాస్థాయి కమిటీలను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడెవరవుతారన్నది చర్చనీయాంశంగా మారింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటాపోటీ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడిగా పలువురు రేసులో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడడంతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివిధ స్థాయిల్లో నూతన కమిటీల నియామక ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా డీసీసీ, నగర అధ్యక్ష పదవులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. డీసీసీ, సిటీ కాంగ్రెస్ కమిటీల నియామకానికి ఏఐసీసీ పరిశీలకుడిగా కర్నాటక లోని బెంగుళూరు ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ఇందూరుకు వచ్చారు. ఇప్పటికే డీసీసీ నియామక ప్రక్రియలో భాగంగా 18మంది దరఖాస్తు చేసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు