అమరావతి, 9 అక్టోబర్ (హి.స.) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు (MLA Nakka Anand Babu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం వద్ద నిధులు లేనప్పుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి... నీకు వచ్చిన నొప్పేంటి జగన్మోహన్ రెడ్డి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలపై హైకోర్టు చెప్పినప్పటికీ.. జగన్ సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విశాఖకు, నర్సీపట్నంకు పులోమని బయలుదేరారన్నారు. అల్లర్లు, అలజడులు సృష్టించడం కోసం నర్సీపట్నం పథకం ప్రకారం వెళ్తున్నారని... సిగ్గు లజ్జా లేని వ్యక్తి జగన్ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే.
మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి జగన్ అన్నారు. కరోనా సమయంలో వేలాది మందిని చంపేశారని మండిపడ్డారు. మాస్కులు అడిగితే పిచ్చొడని చెప్పి డా.సుధాకర్‌ను చంపేశారన్నారు. ‘నువ్వేం వెలగబెట్టావని చూడటానికి పోతున్నావ్ జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో పేద వాడికి వైద్య విద్యను, వైద్యాన్ని కారు చౌకగా అందించాలని, ఉచితంగా పేద పిల్లలకు మెడికల్ సీట్లు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం పీపీపీ విధానానికి వెళ్తుంటే దాన్ని విమర్శిస్తున్నావ్. కోర్టు తీర్పుతో అయినా జగన్‌కు కనువిప్పు కలగాలి. పేదల అభివృద్ధికి అడ్డుగోడగా మారిన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV