ఉగ్రవాద పేలుడు కేసుపై బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన పేలుడు ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందిస్తూ.. దిల్లీలో జరిగిన ఉగ్రవాద పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తుల కుతంత్రమేనని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. అలాగే ఈ దాడి దేశంలో
రాంచందర్


హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన పేలుడు ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందిస్తూ.. దిల్లీలో జరిగిన ఉగ్రవాద పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తుల కుతంత్రమేనని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. అలాగే ఈ దాడి దేశంలో శాంతిని భంగం చేసేందుకు, భారత ప్రగతిని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా నిర్ధారించిందని ఆయన తెలిపారు.

పాకిస్తాన్, జిహాదీ మద్దతుదారులు ఈ దాడికి కారణమని ఆరోపిస్తూ, దేశ భద్రతను దెబ్బతీయాలనే శక్తుల ప్రయత్నమే ఇది అని రాంచందర్ రావు అన్నారు. జాతీయా మీడియా సంస్థతలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనను వెలుగులోకి తీసుకువచ్చిన దర్యాప్తు సంస్థల పనితీరు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. వారు అసలు కుట్రను బహిర్గతం చేసి ప్రజలకు కీలకమైన వివరాలు తెలియజేశారని అన్నారు. ఇది దేశ దర్యాప్తు సంస్థల ఉత్తమ పరిశోధనల్లో ఒకటని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసే సమయంలో జాగ్రత్తగా, సానుకూల దృక్కోణంతో వ్యవహరించాలి సూచించారు. దేశం మొత్తం ఇలాంటి ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు భారత ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande