తిరుమల శ్రీవారి ఆలయంలోకి ముడిసరుకులు చేర్చేందుకు నూతన బాగ్ కన్వేయర్ అందుబాటులోకి
తిరుమల:, 13 నవంబర్ (హి.స.) తిరుమల శ్రీవారి ఆలయంలోకి ముడి సరుకులు చేర్చేందుకు నూతన బ్యాగ్‌ కన్వేయర్‌ (బ్యాగ్‌ స్టాగర్‌) అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా శ్రీవారికి సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డూలు, వడలు, ఇతర ప్రసాదాలన్నీ సంప్రదాయం మేరకు శ్రీవారి ఆల
తిరుమల శ్రీవారి ఆలయంలోకి ముడిసరుకులు చేర్చేందుకు నూతన బాగ్ కన్వేయర్ అందుబాటులోకి


తిరుమల:, 13 నవంబర్ (హి.స.)

తిరుమల శ్రీవారి ఆలయంలోకి ముడి సరుకులు చేర్చేందుకు నూతన బ్యాగ్‌ కన్వేయర్‌ (బ్యాగ్‌ స్టాగర్‌) అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా శ్రీవారికి సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డూలు, వడలు, ఇతర ప్రసాదాలన్నీ సంప్రదాయం మేరకు శ్రీవారి ఆలయంలోని పోటు (కట్టెల పొయ్యితో కూడిన వంటశాల)లోనే తయారవుతాయి. ఈమేరకు నిత్యం దాదాపు 50 టన్నుల నుంచి 65 టన్నుల ముడిసరుకులను ఆలయంలోకి పంపాల్సి ఉంటుంది. మహద్వారం నుంచి ఈ సరుకులను తరలించడం అంటే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande