పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మదర్ డెయిరీ ముందు పాడి రైతుల ధర్నా
యాదాద్రి భువనగిరి, 13 నవంబర్ (హి.స.) మదర్ డెయిరీ భువనగిరి చిల్లింగ్ సెంటర్ ముందు గురువారం పాడి రైతులు ధర్నా నిర్వహించారు. పాడి రైతులకు 8 నెలలుగా బిల్లులు చెల్లించాలంటూ భువనగిరి పాల శీతలీకరణ కేంద్రం ముందు ప్రధాన రహదారిపై భువనగిరి మండలం వీరవెల్లి గ
పాడి రైతుల ధర్నా


యాదాద్రి భువనగిరి, 13 నవంబర్ (హి.స.)

మదర్ డెయిరీ భువనగిరి చిల్లింగ్ సెంటర్ ముందు గురువారం పాడి రైతులు ధర్నా నిర్వహించారు. పాడి రైతులకు 8 నెలలుగా బిల్లులు చెల్లించాలంటూ భువనగిరి పాల శీతలీకరణ కేంద్రం ముందు ప్రధాన రహదారిపై భువనగిరి మండలం వీరవెల్లి గ్రామ రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. వరంగల్ భువనగిరి ప్రధాన రహదారిపై బైఠాయించటంతో ఇరు వైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వీరవెల్లి గ్రామానికి చెందిన సుమారు 120 మంది రైతులకు రూ.24 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande