సౌదీ బస్సు ప్రమాదం పై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.) సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్కు చెందిన ఉమ్రా యాత్రికుల మృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలో ఉన్
Deputy CM


హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.) సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్కు చెందిన ఉమ్రా యాత్రికుల మృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలో ఉన్న ఎన్నారై కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మృతులకు ప్రగడ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు డిప్యూటీ సీఎం సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande