
హనుమకొండ, 17 నవంబర్ (హి.స.)
ప్రఖ్యాతి గాంచిన కాకతీయుల ఆరాధ్య దైవం పద్మాక్షి అమ్మవారిని శ్రీ శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధీశ్వరులు, శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి వారు సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయం వైభవాన్ని వేదాల్లో ప్రతిపాదించిన చక్కటి పురాణ విషయాలను వివరిస్తూ ఇట్టి దేవాలయానికి అనంతమైన అనుష్ఠాన శక్తి కలదని పద్మాక్షి అమ్మవారిని ధర్మదేవతగా రాజ్యలక్ష్మి గా కొలువాలని భక్తులకు సూచించారు. స్వామి వారికి దేవాలయ పక్షాన వంశపారంపర్య అర్చకులు నాగిళ్ల శంకర్ శర్మ గారు పూర్ణకుంభంతో స్వాగతం తెలిపి పుష్పమాల సమర్పించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు