50 లక్షల మంది ఐబొమ్మ యూజర్ల డేటా చోరీ.. సీపీ సజ్జనార్ సంచలన విషయాలు వెల్లడి
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.) పైరసీ అనే భూతం ప్రపంచాన్ని పట్టి పీడీస్తోందని హైదరాబాద్ సీపీ వీ.సీ సజ్జనార్ అన్నారు. పైరసీ మాస్టర్ మైండ్ ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశామని వెల్లడిచారు. ఇవాళ ఉదయం సీపీ సజ్జనార్ ను టాలీవుడ్ స్ట
సీపీ సజ్జనార్


హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)

పైరసీ అనే భూతం ప్రపంచాన్ని పట్టి పీడీస్తోందని హైదరాబాద్ సీపీ వీ.సీ సజ్జనార్ అన్నారు. పైరసీ మాస్టర్ మైండ్ ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశామని వెల్లడిచారు. ఇవాళ ఉదయం సీపీ సజ్జనార్ ను టాలీవుడ్ స్టార్స్ కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి తదితర సీనీ పెద్దలు సీపీని కలిశారు. ఈ సందర్భగా మీడియాతో మాట్లాడిన సజ్జనార్ ఇమ్మడి రవిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గత ఆగస్టు 30న తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టామని ఈక్రమంలో ఇమ్మడి రవిని అరెస్టు చేసి ఐటీ యాక్ట్, కాపీ రైట్ చట్టాల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. అంతకు ముందు పైరసీ కేసులో శివరాజ్, ప్రశాంత్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి పైరసీకి సంబంధించిన పలు కీలక వివరాలు సేకరించామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande