
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
ఇండ్లు నిర్మించుకునే లబ్దిదారులకు దశల వారీగా చెల్లించే మొత్తంలో ప్రభుత్వం కోత పెట్టింది. స్లాబ్ వేసిన అనంతరం చెల్లించాల్సిన రూ.2లక్షల మొత్తంలో నుంచి రూ.60వేలు కోత పెడుతున్నట్లు ప్రకటించింది. రూ.1.40లక్షలు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో జమచేస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మిగతా మొత్తాన్ని ఉపాధి హామీ, మరుగుదొడ్ల నిర్మాణం కింద చూపేందుకు నిర్ణయం తీసుకోవటం పట్ల లబ్దిదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అప్పో సప్పో చేసి తెచ్చిన సొమ్ముతో స్లాబ్ వేస్తే ప్రభుత్వం ఇచ్చిన అనంతరం తిరిగి అప్పు చెల్లించవచ్చనే ధీమాతో ఉన్న లబ్దిదారులు మంత్రి ప్రకటనతో అవాక్కవుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు