
హనుమకొండ, 25 నవంబర్ (హి.స.)
తన అవసరాలకు అనుగుణంగా పార్టీ ఫిరాయింపులే కడియం శ్రీహరి బ్రాండ్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ రాజ్యాంగాన్ని, స్పీకర్ ను అవమానించే విధంగా తను రాజీనామా చేయను అంటున్నారు నువ్వు రాజీనామా చేయకు కడియం శ్రీహరి బహిష్కరణకు సిద్ధంగా ఉండు అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు