
గౌహతి, 26 నవంబర్ (హి.స.)
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో
టీమిండియా చిత్తుచిత్తుగా ఓడింది. 549 టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఒక్కడే 54 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ రన్స్ చేయలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ 6 వికెట్లు, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, ముత్తుస్వామి, మార్కో యాన్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
కాగా, 2 కీలక వికెట్లు కోల్పోయి 27 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో అయిదో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా వెంటవెంటనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం టీ విరామ సమయానికి 47 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 14, రవీంద్ర జడేజా 54 పరుగులతో ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. లాభం లేకుండా పోయింది. ఆ ఇద్దరూ ఆరో వికెట్కు 94 బంతుల్లో 32 పరుగులు జత చేశారు. అనంతరం సాయి సుదర్శన్ ముత్తుస్వామి బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్లోని వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్మెన్ నిలదొక్కుకోలేక బౌలర్లకు వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో సౌతాఫ్రికా 408 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు