
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.)
బీఆర్ఎస్ నేత కేటీఆర్ తమపై చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీలీల ఐటమ్ సాంగ్ కు, కేటీఆర్ ప్రచారానికి ఏం తేడా లేదన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా రాని సచివాలయం, కంట్రోల్ రూమ్ లను కట్టారని, వాటి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరిపై నిఘా కోసం, ఎవరి వాస్తుకోసం వాటిని నిర్మించారు? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఆయన దశ, దిశ సరిగ్గా లేనప్పుడు వాస్తు మారిస్తే ఏమొస్తుందన్నారు. ఆయన కొడుకు జీవితంలో అయితే ఆ రేఖ లేనే లేదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు