ఢిల్లీ నుంచి షాంఘైకి నేరుగా..! కరోనా తర్వాత నేడు మళ్లీ ప్రారంభం
న్యూఢిల్లీ, 9 నవంబర్ (హి.స.) ఢిల్లీ నుంచి షాంఘై విమాన సర్వీసులు ఈ రోజు (ఆదివారం) నుంచి ప్రారంభమవుతాయి. చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ నుంచి బయలు దేరుతుంది. రేపు తెల్లవారుజామున షాంఘై చేరుకుంటుంది. వారానికి
చైనాకు విమానం


న్యూఢిల్లీ, 9 నవంబర్ (హి.స.)

ఢిల్లీ నుంచి షాంఘై విమాన సర్వీసులు ఈ రోజు (ఆదివారం) నుంచి ప్రారంభమవుతాయి. చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ నుంచి బయలు దేరుతుంది. రేపు తెల్లవారుజామున షాంఘై చేరుకుంటుంది. వారానికి మూడు రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఇండిగో సంస్థ కోల్కత్తా నుంచి చైనాలోని గ్వాంగ్జౌ నగరానికి విమాన సర్వీసులను ప్రారంభించింది. కరోనా, గల్వాన్ సరిహద్దులో ఘర్షణ కారణంగా 2020 నుంచి భారత్ చైనా మధ్య విమాన సర్వీస్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో విమాన సర్వీస్లను పునరుద్ధరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande