
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.)
మెగాస్టార్ చిరంజీవికి వివాదాస్పద
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ఒకప్పటి చార్ట్ బస్టర్ సినిమా శివ రీరిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 14వ తేదీ నుండి ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా చూడాలని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో.. తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ సినిమా శివ అన్నారు. కొత్త ఒరవడికి ఈ సినిమా నాందిపలికిందన్నారు. ఇప్పటికీ మర్చిపోలేని కల్ట్ సీన్స్ సినిమాలో ఉన్నాయన్నారు. నాగార్జున, అమల ఈ సినిమాలో అద్భుతంగా నటించారని అన్నారు.
ఇక చిరంజీవి ప్రశంసలు కురిపించడంపై వర్మ ఎక్స్ లో స్పందించారు. చిరుకు కృతజ్ఞతలు చెబుతూ.. అనుకోకుండా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. మీ విశాల హృదయానికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతంలో చాలాసార్లు చిరంజీవిపై ఆర్జీవీ సెట్లైర్లు వేసిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు