
అమరావతి, 9 నవంబర్ (హి.స.)
రామచంద్రాపురం, కోనసీమ జిల్లా జిల్లా రామచంద్రపురంలో ఐదవ తరగతి బాలిక రంజిత అనుమాస్పద మృతి మిస్టరీ వీడింది. బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యల శ్రీనివాసే నిందితుడని పోలీసులు తేల్చారు. ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో శ్రీనివాసరావు బాలికను హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ