
గోదావరిఖని, 9 నవంబర్ (హి.స.)
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం
ప్రతి సంవత్సరం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, గోదావరిఖనిలో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా చేయాలని అధికారులను సింగరేణి సిఎండి బలరాం నాయక్ ఆదేశించారు. ఆదివారం గోదావరిఖనిలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్, సమ్మక్క, సారలమ్మ దేవాలయం, రోడ్ల నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఆయన మాట్లాడారు. చేపడుతున్న అభివృద్ధి పనుల్లో సింగరేణి భాగంగా గోదావరిఖనిలో ప్రజలు, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నిర్మిస్తున్న రోడ్లు సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్, రోడ్డు పనులను త్వరగా చేయాలని కాంట్రాక్టర్కు స్వయంగా ఫోన్ చేసి మందలించారు. కార్మికుల ఆరోగ్యం కోసం ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నివసించేందుకు నూతనంగా 1000 క్వార్టర్ను నిర్మిస్తున్నామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు