
జయశంకర్ భూపాలపల్లి, 9 నవంబర్ (హి.స.)
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను పట్టుకున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. తక్కువ ధరకు బంగారం ఇస్తానని నమ్మబలుకుతూ కాటారంలో ఓ సూపర్ మార్కెట్ యజమానిని ఆర్థికంగా మోసం చేసి, కాటారం మండల పరిధిలోని నస్తురుపల్లి వద్ద ఓ వ్యక్తిపై భౌతిక దాడి చేశారు. దొంగలను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ కిరణ్ ఖేరే ఆదేశాలతో ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతుండగా, శనివారం రాత్రి కాటారం మండల పరిధిలోని చింతకాని గ్రామ శివారులో ఐదుగురు వ్యక్తులు (ఇద్దరు మగ, ముగ్గురు మహిళలు) కాటారం నుండి మేడారం వైపు వెళ్తూ అనుమానస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, సూపర్ మార్కెట్ యజమానీతో పాటు, ఓ వ్యక్తి పై భౌతిక దాడి చేసి దారి దోపిడీ చేసింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు.
ఈ నేరాలు చేసిన వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన రాజు సోలంకి, నాగపూర్కు చెందిన పుణ్య బాల బాలచంద్ రాథోడ్, మీనా పుణ్య రాథోడ్, మహారాష్ట్ర కారేగావ్కు చెందిన శాంతి విజయ సోలంకి, స్వప్న ఈశ్వర్ సోలంకి ఉన్నట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించి, అరెస్టు చేసి, నిందితుల నుంచి రూ.3 లక్షల 48 వేల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పి చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు