
జనగామ, 5 డిసెంబర్ (హి.స.)
స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభినందించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న 110గ్రామ పంచాయతీలకు 10గ్రామ పంచాయతీలు అలాగే రెండవ విడతలో ఎన్నికలు జరగనున్న ధర్మసాగర్, వేలేరు మండలాలలో పంచాయితీలు మొత్తం 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు