ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా నేటి నుంచి మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన
విజయవాడ, 6 డిసెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడా పర్యటనకు బయల్దేరారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు సాగ
లోకేశ్‌


విజయవాడ, 6 డిసెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడా పర్యటనకు బయల్దేరారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభించారు.

ఐదు రోజుల పాటు సాగనున్న ఈ టూర్‌లో ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారించనున్నారు.

పర్యటనలో భాగంగా తొలిరోజు ఆయన అమెరికాలోని డల్లాస్‌లో జరిగే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఈ నెల 8, 9 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం గత 18 నెలల కాలంలో ఆయన అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande