ముంబై, 19 ఫిబ్రవరి (హి.స.)
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.
అలాగే బాలీవుడ్ లోను మరో భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు రిషబ్ శెట్టి. ప్రియాంక చోప్రా నటించిన మేరీ కోమ్, అమితాబ్ బచ్చన్-నటించిన ఝుండ్ వంటి పలు ప్రశంసలు పొందిన చిత్రాలను నిర్మించిన సందీప్ సింగ్ దర్శకత్వంలో “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.
ఇందులో శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టిని చూసేందుకు ఆయన ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ రానున్న ఈ చిత్రం 2027 జనవరి 21 న థియేటర్లలో విడుదల అవుతుందని రిషబ్ తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..