కుల మతాలకు అతీతంగా సేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి - రాజేష్ రెడ్డి
కుల మతాలకు అతీతంగా సేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి - రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  రాజేష్ రెడ్డి


నాగర్ కర్నూల్. 19 ఫిబ్రవరి (హి.స.)

కుల మతాలకు అతీతంగా సేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచ్చుకుల రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మైనార్టీ యువకుల ఆధ్వర్యంలో శ్రీశైలం కాలినడకన వెళ్లే శివ స్వాముల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే శివ స్వాములకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కులమతాలకతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం కంటే తనను కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా చేసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్

 rajesh pande