ఏ.పీ, 13 మార్చి (హి.స.)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన ఓబులాపురం అక్రమ మైనింగ్ పరిశీలన కేసును కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం మైనింగ్ పై గతంలో టీడీపీ నేతలు చేపట్టిన ఆందోళనలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణకు విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు హాజరయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ఎర్రబెల్లి దయాకర్, చినరాజప్ప, ధూళిపాళ నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఆందోళన పై టీడీపీ నేతలపై నమోదై న చేసిన ప్రజాప్రతిని కోర్టు కొట్టివేసింది. గత కొన్ని సంవత్సరాలుగా విచారణ హాజరవుతున్న టీడీపీ నేతలకు కేసు కొట్టి వేయటంతో ఊరట లభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..