రేషన్.కార్డుల.ఇక రెండు రకాలుగా ఉంటాయని పౌర సరఫరాలు.నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.తెలిపారు
, హైదరాబాద్‌: 14 మార్చి (హి.స.)రేషన్‌ కార్డులు ఇక రెండు రకాలుగా ఉంటాయని పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్‌ కార్డులు.. ఎగువన ఉన్నవారికి ఏపీఎల్‌ కార్డులు ఇచ్చే ఆల
రేషన్.కార్డుల.ఇక రెండు రకాలుగా ఉంటాయని పౌర సరఫరాలు.నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.తెలిపారు


, హైదరాబాద్‌: 14 మార్చి (హి.స.)రేషన్‌ కార్డులు ఇక రెండు రకాలుగా ఉంటాయని పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్‌ కార్డులు.. ఎగువన ఉన్నవారికి ఏపీఎల్‌ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ట్రైకలర్‌లో బీపీఎల్‌ కార్డులను, గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గురువారమిక్కడ అసెంబ్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 2.8 కోట్ల మంది రేషన్‌కార్డుల లబ్ధిదారులుగా ఇప్పటికే ఉన్నారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇస్తుంది. కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచాం. ఆ ప్రక్రియ నెలాఖరులోగా అయిపోతుంది. కొత్త రేషన్‌కార్డుల జారీ ఏప్రిల్‌లో ఉండొచ్చు. కొత్తవారితో పాటు ఇప్పటికే కార్డులున్న వారికి స్మార్ట్‌కార్డులు జారీచేస్తున్నాం. గతంలో పింక్‌కార్డులు ఉన్నవారికి గ్రీన్‌కార్డులు, తెల్లకార్డు ఉన్నవారికి ట్రైకలర్‌ కార్డులు వస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande