తెలంగాణ, సూర్యాపేట. 14 మార్చి (హి.స.)
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి
ఎమ్మెల్యే మందుల సామేలు పెద్ద కొడుకైతే తాను చిన్న కొడుకునని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటాలో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ. రాజకీయ భిక్ష పెట్టడంతోపాటు చిరకాల వాంఛ గా ఉన్న ఎమ్మెల్సీ పదవిలో కూర్చో పెట్టిన తుంగతుర్తిని ఏనాటికి మర్చిపోనని అన్నారు.
ఎమ్మెల్యే సామేల్ తో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సేవలందిస్తానని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్సీగా సూర్యాపేట జిల్లాను ఒక వేదికగా మలచుకొని ప్రభుత్వ పథకాలన్ని ప్రజల చెంతకు తీసుకురావడమే కాకుండా ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే సభ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్