కూకట్పల్లి లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
హైదరాబాద్, 14 మార్చి (హి.స.) కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివేకానంద నగర్ లోని పల్లవి రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఫైర్ యాక్సిడెంట్


హైదరాబాద్, 14 మార్చి (హి.స.)

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివేకానంద నగర్ లోని పల్లవి రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande