తెలంగాణ, సంగారెడ్డి. 14 మార్చి (హి.స.)
కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి పట్టంలోని రామ్ నగర్ కాలనీలో తన చిన్న నాటి మిత్రులతో కలిసి కాముని దహన వేడుకల్లో పాల్గొన్నారు. తన చిన్నప్పటి దోస్తులతో కాసేపు ముచ్చిటించిన తర్వాత హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు కొడుతూ.. డ్యాన్స్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్లందరిని ఉత్సాహపరిచాడు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్