ఓదెలా 2' - మూవీ రివ్యూ!
తిరుపతి, 17 ఏప్రిల్ (హి.స.) కొత్త కథను క్రియేట్‌ చేసి, ఆ కథతో జనాలను మెప్పించడం ఈ రోజుల్లో కష్టతరమే. అందుకే కాబోలు మన దర్శకులు తాము తీసిన చిత్రాలకే సీక్వెల్‌ కథలను అల్లుతూ, రెడీమేడ్‌ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముందు చిత్రాలకు జనాదరణ రావడం
మూవీ రివ్యూ


తిరుపతి, 17 ఏప్రిల్ (హి.స.)

కొత్త కథను క్రియేట్‌ చేసి, ఆ కథతో జనాలను మెప్పించడం ఈ రోజుల్లో కష్టతరమే. అందుకే కాబోలు మన దర్శకులు తాము తీసిన చిత్రాలకే సీక్వెల్‌ కథలను అల్లుతూ, రెడీమేడ్‌ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముందు చిత్రాలకు జనాదరణ రావడంతో ఆ కథలనే కొనసాగిస్తూ సీక్వెల్‌ కథలను రెడీ చేస్తున్నారు. ఇక ఈ ప్రయత్నంలో కొన్ని సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలవగా, మరికొన్ని ఫెయిల్యూర్స్‌గా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడుతున్నాయి.

ఇక ఇప్పుడున్న సీక్వెల్స్‌ వరుసలో వచ్చిన మరో సినిమా 'ఓదెల-2'. ఇంతకు ముందు ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందిన 'ఓదెల' చిత్రానికి సీక్వెల్‌ ఇది. సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించింది. ఇక ఈ రోజు (ఏప్రిల్‌ 17)న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ చిత్రం ఎలా ఉంది? సూపర్‌ నేచురల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఆకట్టుకుందా? లేదా తెలుసుకుందాం.

కథ: తొలిభాగంకు కొనసాగింపుగా ఓదెల గ్రామంలో ఈ కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలను రేప్‌ చేసి చంపుతున్న సైకో తిరుపతి (వశిష్ట సింహా)ని అతని భార్య రాధ (హెబ్బా పటేల్‌) చంపేసి జైలుకు వెళుతుంది. ఇక ఎన్నాళ్ల నుంచో ఊరుకు పట్టిన తిరుపతి పీడ విరగడైందని ఆ ఊరి ప్రజలు సంతోషపడతారు. అయితే తిరుపతి ఆత్మ, ప్రేతాత్మగా మారి మళ్లీ ఊరిలో అత్యాచారాలు, హత్యలు చేస్తుంటుంది. ఈ అత్యాచారాలు, హత్యలు తిరుపతి ప్రేతాత్మగా మారి చేస్తున్నాడని ఊరి జనాలు తెలుసుకుంటారు. ఇంకా ఊరి జనాలను కాపాడటానికి నాగ సాధువు బైరవి (తమన్నా) ఆ ఊరికి వస్తుంది. అసలు భైరవికి ఊరికి ఉన్న సంబంధం ఏమిటి? తిరుపతి, ప్రేతాత్మకు, భైరవికి మధ్య జరిగిందేమిటి? అనేది కథ

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande