హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.) ఐపీఎల్ 2025 సీజన్ లో సగం మ్యాచులు పూర్తవడంతో నేటి నుంచి రివేంజ్ వీక్ ప్రారంభం కానుంది. ఈ వారంలో గత మ్యాచుల్లో ఓడిన, గెలిచిన జట్లు తమ ప్రత్యర్థులపై రివేంజ్ తీసుకునేందుకు అవకాశం కలగనుంది. అలాగే ఈ రోజు ఆదివారం కావడంతో డబుల్ డెక్కర్ మ్యాచులు నిర్వహించనున్నారు. కాగా మొదటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3. 30 గంటలకు చంఢీఘర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ రేసుకు అతి చేరువలోకి వెళ్తుంది. రాత్రి జరిగే రెండో మ్యాచులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7. 30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..