కోనేరు హంపి ఖాతాలో ఫిడే టైటిల్
పూణే , 24 ఏప్రిల్ (హి.స.) తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచారు. పూణే వేదికగా నిర్వహించిన ఈ చెస్ టోర్నమెంట్‌లో తుది పోరు సమయానికి చైనా క్రీడాకారిణి జు జినర్‌తో కలిసి హంపి అగ్రస్థ
Koneru Hampi


పూణే , 24 ఏప్రిల్ (హి.స.)

తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచారు. పూణే వేదికగా నిర్వహించిన ఈ చెస్ టోర్నమెంట్‌లో తుది పోరు సమయానికి చైనా క్రీడాకారిణి జు జినర్‌తో కలిసి హంపి అగ్రస్థానంలో కొనసాగారు.

ఫైనల్ రౌండ్‌లో కోనేరు హంపి బల్గేరియాకు చెందిన సుర్గుయిల్ సలిమావాపై 1-0 తేడాతో గెలుపొందారు. మరోపక్క జు జినర్ కూడా రష్యాకు చెందిన పొలినా షువలోవాపై విజయం సాధించడంతో వీరిద్దరూ మొదటి స్థానంతో ముగించారు. అయితే, ఉత్తమ టై-బ్రేక్ ఆధారంగా హంపి టైటిల్ విజేతగా నిలిచారు.

మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక మంగోలియా క్రీడాకారిణి ముంగంతూర్ బత్ఖుయాగ్‌తో, వైశాలి జార్జియా క్రీడాకారిణి సలోమ్ మెలియాతో, దివ్య దేశ్‌ముఖ్ రష్యాకు చెందిన ఎలీనా కాష్లిన్‌స్కాయాతో తమ గేమ్‌లను డ్రాగా ముగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande