పహల్గాంలో దాడికి పాల్పడిన వారు స్వాతంత్ర్య సమరయోధులై ఉంటారు: పాకిస్థాన్ ఉప ప్రధాని
ఇస్లామాబాద్‌, 25 ఏప్రిల్ (హి.స.) జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని భారత్ ఆరోపించగా, ఆ ఆరోపణలను పాకిస్థాన్ తోసిపుచ్చింది. ఈ పరిణ
పహల్గాంలో దాడికి పాల్పడిన వారు స్వాతంత్ర్య సమరయోధులై ఉంటారు: పాకిస్థాన్ ఉప ప్రధాని


ఇస్లామాబాద్‌, 25 ఏప్రిల్ (హి.స.)

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని భారత్ ఆరోపించగా, ఆ ఆరోపణలను పాకిస్థాన్ తోసిపుచ్చింది. ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. పహల్గాం దాడికి పాల్పడిన వారిని ఆయన 'స్వాతంత్ర్య సమరయోధులు'గా అభివర్ణించారు. ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో, సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఇషాక్ దార్ స్పందించారు. ఇది ఏకపక్ష నిర్ణయమని, తాము దీనిని అంగీకరించబోమని స్పష్టం చేశారు. భారత్ తీసుకున్న ఈ చర్యకు ప్రతిచర్యలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande