
ముంబై, 25 ఏప్రిల్ (హి.స.)బంగారం ధరలు నేడు కూడా భారీగా తగ్గాయి ఏప్రిల్ 25 శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,230 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,040 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,10,800 పలికింది. బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చిన మార్పులే అని చెప్పవచ్చు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ దేశాల పైన విధించినటువంటి దిగుమతి సుంకాలపై ఆయా దేశాలతో చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
. ఇది ఇలా ఉంటే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అంటే, ప్రస్తుతం వచ్చిన తగ్గుదల స్వల్పకాలికమైనని అయితే ఈ అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు మెరుగుపడితే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి