ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.) ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వ
బండి సంజయ్


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)

ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుండబోతున్నాయని అన్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, ఇందుకు యావత్ దేశం అండగా నిలవాలని కోరారు.

ఈరోజు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివ్రుద్ది కేంద్రంలో నిర్వహించిన 'రోజ్ గార్ మేళా' కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో వారు కీలక వ్యాఖ్యలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande