కంచి పీఠం 71వ పీఠాధిపతిగా ఏపీకి చెందిన గణేశ్ శర్మ
కాంచీపురం, 26 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరంకు చెందిన రుగ్వేద పండితుడికి అరుదైన గౌరవం లభించింది. తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరంకు చెందిన గణేశ్ శర్మ ఎంపికయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుత
కంచి పీఠం 71వ పీఠాధిపతిగా ఏపీకి చెందిన గణేశ్ శర్మ


కాంచీపురం, 26 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరంకు చెందిన రుగ్వేద పండితుడికి అరుదైన గౌరవం లభించింది. తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరంకు చెందిన గణేశ్ శర్మ ఎంపికయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను ఎంపిక చేసినట్లు సంస్థానానికి చెందిన చల్లా విశ్వనాథశాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న కాంచీపురం కామాక్షి ఆలయంలో ఆయనకు సన్యాస దీక్షను ప్రసాదిస్తారని విశ్వనాధశాస్త్రి పేర్కొన్నారు.

అన్నవరంకు చెందిన దుడ్డు ధన్వంతరి, మంగాదేవి దంపతుల పెద్ద కుమారుడైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ 1998లో జన్మించారు. 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించిన గణేశ్ శర్మ ద్వారకా తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు.

యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించిన ఘనాపాటి గణేశ్ శర్మ కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. గణేశ్ శర్మకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల అన్నవరం క్షేత్రంలోని వ్రత పురోహితులు, అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande