తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే.. హరీష్ రావు
తెలంగాణ, వరంగల్. 26 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పని చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్, కేస
హరీష్ రావు


తెలంగాణ, వరంగల్. 26 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పని చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్, కేసీఆర్ వైపే చూస్తున్నారని చెప్పారు. ఇవాళ వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రేపటి బీఆర్ఎస్ రజితోత్సవ సభాస్థలి వద్ద మీడియాతో మాట్లాడారు. రేపటి సభకు రాష్ట్రవ్యాప్తంగా అంచనాలకు మించిన జనం స్వచ్ఛందంగా తరలిరాబోతున్నారన్నారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారో వినాలనే ఉత్సాహం, ఆతృత కాంగ్రెస్ నాయకులకే ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande